లస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసింది.. నానిని పట్టేసింది.!

By అంజి  Published on  20 Jan 2020 11:11 AM GMT
లస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసింది.. నానిని పట్టేసింది.!

డైరెక్షన్ కే లైఫ్ ని డెడికేట్ చేసిన లేడి డైరెక్టర్ నందినిరెడ్డి డైరెక్షన్‌లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన 'ఓ బేబీ' సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి గతాడేది సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. దాంతో నందిని రెడ్డి తరువాత సినిమా పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే నందిని రెడ్డి 'ఓ బేబీ' చిత్రీకరణ సమయంలోనే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే నందిని రెడ్డి ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి పని చేస్తోంది. లస్ట్ స్టోరీస్ లో ఆమె ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా తాజాగా పూర్తి అయింది. యూనిట్ ఫస్ట్ కాపీ కూడా చూసుకుని అవుట్ ఫుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు.

ఇక ప్రస్తుతం నందిని రెడ్డి తన సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రియాంక దత్ నిర్మించనున్నారు. 'మహానటి మరియు ఓ బేబీ' సినిమాలకు అద్భుతమైన మనోహరమైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అదించనున్నారు. ఇక ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నందిని ఆల్ రెడీ నానితో అలా మొదలైంది సినిమా చేసింది.

Next Story