దిల్ రాజుపై చిరు సెటైర్.. అస‌లు కార‌ణం ఇదే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 10:16 AM GMT
దిల్ రాజుపై చిరు సెటైర్.. అస‌లు కార‌ణం ఇదే.!

మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దాదాపు 200 కోట్ల‌తో ఈ భారీ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన 'సైరా' థ్యాంక్స్ మీట్ కి ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఆయ‌న‌ ఈ సినిమాని నైజాంలో పంపిణీ చేసారు. అయితే.. ఈ వేడుక‌లో దిల్ రాజు మాట్లాడుతూ... ప్ర‌పంచ వ్యాప్తంగా సైరా సినిమాకి 85 కోట్లు గ్రాస్ వ‌చ్చింద‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. ఇలా దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్న‌ప్పుడు చిరంజీవి.. చ‌ర‌ణ్ కి దిల్ రాజు ఎంతో కొంత డ‌బ్బులు ఇస్తాడ‌ని అనుకుంటున్నాను అన్నారు. అంతే... ఒక్క‌సారిగా అక్క‌డున్న వాళ్లంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేసారు.

చిరు.. ఇలా దిల్ రాజు పై సెటైర్ వేయ‌డం వెన‌క ఓ బ‌ల‌మైన‌ కార‌ణం ఉంది. ఇంత‌కీ.. మేట‌ర్ ఏంటంటే... దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల‌కు క‌లెక్ష‌న్స్ వ‌స్తాయి కానీ... ఆ క‌లెక్ష‌న్స్ ని నిర్మాత ఇవ్వ‌కుండా ఏవేవో త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తాడు అని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ ఉంది. దీని గురించి తెలుసు కాబ‌ట్టే... చిరంజీవి అలా స్పందించార‌ని.. చ‌ర‌ణ్ కి త‌ప్పుడు లెక్క‌లు చూపించ‌కుండా వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కి త‌గ్గ‌ట్టుగా అమౌంట్ ఇస్తాడ‌ని న‌మ్ముతున్నాను అన్నార‌ని టాక్. అదీ.. సంగ‌తి.

Next Story
Share it