సినీ నిర్మాత దిల్‌రాజ్ రెండో పెళ్లిపై ఇప్పుడు పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమంటున్నాయి. కాగా, ఈ విష‌యంపై ఇప్ప‌టి ఎవ‌రూ కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు. అంతేకాదు ఈ విష‌యంపై ఎవ్వ‌రూ కూడా ఖండించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మే కావ‌చ్చు అంటున్నారు అభిమానులు. దిల్‌రాజ్ రెండో పెళ్లి ఎవ్వ‌రికి తెలియ‌కుండా జ‌రిగిపోయిన‌ట్లు ఓ ఇంగ్లీష్ వార్త క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కానీ ఆయ‌న పెళ్లి ఎక్క‌డ జ‌రిగింది..? ఎవ‌రిని పెళ్లి చేసుకున్నారు..? అనే విష‌యం మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే షాద్‌న‌గ‌ర్‌లోని ప్ర‌కాశ్‌ గెస్ట్ హౌస్‌లో కొంత మంది స్నేహితుల స‌మ‌క్షంలో దిల్‌రాజ్ పెళ్లి జ‌రిగిన‌ట్లు స‌మాచారం. కాగా, మూడు సంవ‌త్స‌రాల క్రితం దిల్‌రాజ్ భార్య అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

దిల్‌రాజ్‌కు ఒక కూతురు. పెళ్లి కూడా అయిపోయింది. భార్య మృతి చెందిన త‌ర్వాత దిల్‌రాజ్ ఒంట‌రిగా ఉంటున్నారు. ఇక ఆయ‌నకు తోడు లేక‌పోవ‌డంతో స్నేహితుల స‌ల‌హా మేర‌కు పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కులాంతర‌ వివాహ‌మేనా..?

కాగా, దిల్‌రాజ్ కులాంత‌ర వివాహం చేసుకున్నాడ‌ని, ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు అమెరికాలో ఉంటార‌ని స‌మాచారం. పెళ్లి చేసుకున్నావిడ గ‌తంలో ఎయిర్ హోస్ట్రెస్‌గా ప‌ని చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక దిల్‌రాజ్ పెళ్లిపై పుకార్లు వ్యాపించ‌డంతో ఈ వ‌య‌సులో పెళ్లి చేసుకుంటే త‌ప్పేంట‌ని కొంద‌రంటున్నారు. కాగా, దిల్‌రాజ్ ఈ ఏడాది మ‌హేష్‌బాబు న‌టించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్రంతో మంచి విజ‌యం అందుకున్నారు. ఆ త‌ర్వాత ‘జాను’ తో వ‌చ్చాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.