భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ భవితవ్యంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ధోనీ క్రికెట్ భవిష్యత్తుపై తమకు స్పష్టత ఉందని అన్నారు. కొన్ని విషయాలు మూసి ఉన్న డోర్స్‌ లోపలే ఉండాలని.. ధోనీ క్రికెట్ భ‌విత‌వ్యంపై బహిరంగ వేదికలపై వెల్లడించ‌మ‌న్నారు. ధోనీ విష‌య‌మై సెలక్టర్లకు ఎప్పుడూ ఓ అంచనా ఉంటుంద‌న్నారు.

ఇదిలావుంటే.. ఇటీవల ధోనీ త‌న‌ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. జనవరి తర్వాత తన నిర్ణయం ఉంటుందన్నాడు. జనవరి వరకూ తనను ఏమీ అడగవద్దని.. అప్ప‌టివ‌ర‌కూ నిరీక్షించండి అని తెలిపాడు. దీంతో వచ్చే టీ20 వరల్డ్‌కప్ కు ధోనీ అందుబాటులో ఉంటాడ‌ని భావిస్తున్నారు.

అలాగే.. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కూడా ధోనీ భ‌విష్య‌త్ వ్యాఖ్యానించాడు. రాబోవు ఐపీఎల్‌ సీజన్‌ తర్వాతే ధోనీ క్రికెట్‌ భవిష్యత్తు గురించి క్లియర్‌ పిక్చర్‌ తెలుస్తుందని అన్నాడు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌ ముగిసినప్ప‌టి నుండి ధోనీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజులు ఆర్మీలో ప‌నిచేయ‌గా.. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story