న‌న్ను క్ష‌మించండి.. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 9:28 AM GMT
న‌న్ను క్ష‌మించండి.. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది

భారత మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాష్ చోప్రాను ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజ‌న్లు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులు‌ ఆకాశ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. క్రికెట్‌ వ్యాఖ్యతగా, విశ్లేషకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్‌.. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నాడంటే అర్థం చేసుకోవ‌చ్చు అత‌న్ని ఏ రేంజ్‌లో ఆడుకుంటున్నారో.

ఏం జ‌రిగిందంటే..

ఒక‌వేళ‌ ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌‌ నిర్వహిస్తే.. ఆ టోర్నీలో పాల్గొనబోయే 14మంది ఆట‌గాళ్ల‌తో భారత జట్టును ఆకాశ్‌ చోప్రా అంచనా వేశాడు. అయితే.. 14 మందిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి చోటు కల్పించలేదు. అలాగే.. టీమిండియా వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశాడు. ధోనీకి జట్టులో చోటు కల్పించకపోవడంతో.. అత‌ని అభిమానులు ఆకాష్‌ను విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు‌. దీంతో ఆకాష్.. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నాడు.

అయితే.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్‌తో జరిగిన చాట్‌లో ఆకాష్ చోప్రా పాల్గోన్నాడు. ఆ చాట్‌లో ఎంఎస్ ధోనీ అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశాడు. 'కొందరు నన్ను, నా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉంటున్నాను. జరిగిందేదో జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి అంటూ ఆకాశ్ మహీ అభిమానుల‌ను‌ కోరాడు. దీంతో ఇకనైనా నెటిజ‌న్లు ఆకాష్‌పై ట్రోలింగ్ ఆపుతారో.. లేదో.. చూడాలి మ‌రి.

Next Story