ఆదాయం రూ.800కోట్లు.. విరాళం రూ.ల‌క్ష‌.. మ‌హేంద్రుడిపై ట్రోల్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2020 12:26 PM GMT
ఆదాయం రూ.800కోట్లు.. విరాళం రూ.ల‌క్ష‌.. మ‌హేంద్రుడిపై ట్రోల్స్‌

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 24వేల మంది మృత్యువాత ప‌డ‌గా.. ఐదు ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్ కేసుల‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. ఇదిలా ఉంటే.. క‌రోనా బాధితుల కోసం, సామాన్య ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు చాలా మంది సెల‌బ్రెటీలు తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇప్ప‌టికే చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు రూ.50ల‌క్ష‌లు, రూ.75ల‌క్ష‌లు, రూ కోటిపైగా విరాళం ప్ర‌క‌టించారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని మాత్రం బాధిత కుటుంబాల‌కు రూ.ల‌క్ష మాత్ర‌మే విరాళంగా ఇచ్చారు.

దీంతో నెటింట్లో మ‌హేంద్రుడిని ట్రోల్ చేస్తున్నారు. రూ.800కోట్ల ఆదాయం పెట్టుకుని కేవ‌లం రూ.ల‌క్ష మాత్ర‌మేనా ఇచ్చేదని ట్వీట్ చేస్తున్నారు. పూణేలోని 100కుటుంబాల‌కు ధోని రూ.ల‌క్ష విరాళంగా ఇచ్చాడు. కానీ అత‌ని ఆదాయం మాత్రం రూ.800కోట్లు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక‌రు అబ్బో చాలా ఎక్కువ ఇచ్చారేమో అంటూ వెట‌కారంగా కామెంట్లు పెడుతున్నారు. కాగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రుడికి మిస్ట‌ర్ కూల్ అనే పేరు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌డ‌ని.. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటాడ‌నే పేరు ఉంది. మ‌రి ఇప్పుడు ఈ ట్రోలింగ్ పై మ‌హేంద్రుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలి రూ.50ల‌క్ష‌ల విలువ చేసే బియ్యం విరాళంగా ఇవ్వ‌గా స‌చిన్ రూ.50ల‌క్ష‌లు, శిఖ‌ర్ ధావ‌న్‌, యూస‌ఫ్ ప‌ఠాన్‌లు త‌మ వంతు సాయం చేశారు.



Next Story