ముంబై: ఇప్పుడంతా ఇంటర్నెట్టే. చేతిలో మొబైల్ ఉంటే వెంటనే ఇంటర్నెట్‌లో ఏదో సెర్చ్ చేస్తుంటాం. ఈ వెతుకాటే మనల్ని ప్రమాదకర వెబ్ సైట్ల వైపు మళ్లిస్తుంది. అవును మీరు చదువుతున్నది కరక్టే. నేటి యువత ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతుంది. అంతేకాదు…నెట్‌లేకపోతే ప్రాణం పోయినంత పని అవుతుంది. యువతకు ఉన్న వీక్ నెస్ ను సైబర్‌ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.

ధోని..భారత క్రికెట్‌లో లెజెండ్. మహేందర్ సింగ్ ధోనీ గురించి చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. అతను కొట్టిన సిక్స్ లు , చేసిన స్టంప్ అవుట్‌లు, విన్యాసాలు, సెంచరీలు కోసం చాలా మంది ఈ ఆటగాడి కోసం నెట్ లో వెతుకుతుంటారు. దీనిని సైబర్ నేరగాళ్లు పట్టుకుంటున్నారు. ఇక్కడే దోనీ వెరీ డేంజర్ మేన్‌గా మారిపోయాడు. ధోని గురించి వెతుకుతున్న సమయంలో మాలీసియస్ లింక్‌లు రీడైరక్ట్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని చెప్పింది మెకాఫీ సంస్థ. అంతేకాదు..ధోనీలా ఎవరున్నారో నివేదిక కూడా రెడీ చేసింది. ఈ లిస్ట్‌లో మన బ్యాడ్మింటన్ స్టార్‌ సింధూ, మాజీ క్రికెటర్‌ సచిన్‌, రాధిక కపూర్, శ్రద్ధా కపూర్ ఉన్నారు.

ఇక్కడ విషయం ఏంటంటే..డేంజర్ సెలబ్రిటీల్లో ధోని, సచిన్‌ ఉండటం ఆశ్చర్యం గొలుపుతుంది. సన్నీ లియోన్‌ నాలుగోస్థానంలో ఉంటే.. టీవీ సెలబ్రిటీ గౌతమ్ ఆమెకంటే ముందు ఉండటం గమనార్హం. అధికార వెబ్ సైట్ల నుంచే సమాచారం తీసుకోవాలంటున్నారు మోకాఫీ ఎండీ వెంకట్ కృష్ణారావు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.