ఇది కుట్ర కాదా?: దేవినేని ఉమ

By సుభాష్  Published on  8 March 2020 2:44 PM GMT
ఇది కుట్ర కాదా?: దేవినేని ఉమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు కావడంపై టీడీపీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నేత దేవినేని ఉమ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలు ఎంపీటీసీలుగా లేని చోట బీసీలకు రిజర్వ్‌ చేయడం కుట్ర కదా.. అని ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది కానీ ఎంపీటీసీ బీసీ మహిళ లేదన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో 16 మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా బీసీ లేరు. కృష్ణా జిల్లాలో ఆరు మండలాల్లో ఊడు మండలాలకు బీసీ పురుషులు లేరని, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలాంలో 30 ఎంపీటీసీల్లో ఒక్క బీసీ సోదరు, ఒక్క బీసీ సోదరి లేరన్నారు. దీన్ని బట్టి చూస్తే కొంత మంది నాయకుల కనుస్నల్లో అధికారులు తప్పు చేశారనిపిస్తోందని ఆరోపించారు.

ఒక్క అవకాశం అంటూ అధికారం అందుకుని, జగన్‌ బడుగు, బలహీన వర్గాల వారి గొంతునొక్కే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it