ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశంసిస్తూ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చేసిన టిక్‌ టాక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెర చక్కర్లు కొడుతుంది. ‘రాయలసీమ ముద్దు బిడ్డ మన ఉగనన్న’ అనే పాటకు డిప్యూటీ సీఎం టిక్‌ టాక్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ పాట నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఓ డిప్యూటీ సీఎం ఇలాంటి టిక్‌ టాక్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో విజయనగరం జిల్లా నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమె డిప్యూటీ సీఎం పదవీని కట్టబెట్టారు జగన్‌. ఇక జగన్‌ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసు గల మంత్రిగా గుర్తింపు పొందారు.

పాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. జగన్ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ఈ పాటను రిలీజ్ చేసింది. మంగ్లీ పాడిన ఈ పాట.. ఏపీ ప్రజలను ముఖ్యంగా రాయలసీమ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. జగన్ పాదయాత్రలోని ఆసక్తికర సన్నివేశాలతో ఈ పాటను రూపొందించారు.

రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న 😍మన పుష్ప శ్రీవాణి అక్క టిక్ టాక్ వీడియో❤👌

Posted by Chennamsetti Zakeer YSRCP on Tuesday, December 31, 2019

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.