ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:14 PM GMT
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోదీతో సమావేశమై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా - గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు సమాచారం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా మోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనతో సీఎం కేసీఆర్ భేటీ కావడం మొదటిసారి.

ప్రధానిని కలవడానికి ముందు సీఎం కేసీఆర్ హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ అయ్యారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మరికొంత మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది.

Next Story