ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. 70 అసెంబ్లీ సీట్లున్న అసెంబ్లీలో ఆప్‌ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాలకే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ మాత్రం అడ్రస్‌ లేకుండా పోయింది. ఇక కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

‘ధన్యవాద్ ఢిల్లీ’  పేరుతో ఈ ప్రమాణ స్వీకారం  జరుగుతోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మంత్రులుగా మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మూడువేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.