కిడ్నాప్‌కు గురైన దీక్షిత్ రెడ్డిని హత్య చేసిన కిడ్నాపర్లు
By సుభాష్ Published on 22 Oct 2020 5:45 AM GMTమహబూబాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ చివరకు విషాదంగా ముగిసింది. బాలున్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు చివరికి కనికరం లేకుండా చంపేశారు. దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా ఏ మాత్రం కనికరించకుండా బాలున్ని పొట్టనపెట్టుకున్నారు. 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు ఎక్కడ దొరికపోతామేమోనన్న భయంతో బాలున్ని అన్యాయంగా బలితీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. నాలుగు రోజులుగా బిడ్డ తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. దీక్షిత్ మరణవార్త విని కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గత ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. బిడ్డ కనిపించకుండా పోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆ రోజు రాత్రంతా బంధువులు, తెలిసిన వారి వద్ద నుంచి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, కిడ్నాపర్ దీక్షిత్ తల్లికి ఫోన్ కాల్ చేశాడు. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీక్షిత్ తల్లి మాత్రం తన బిడ్డకు ఎలాంటి హాని చేయకూడదని, డబ్బులు ఎన్ని కావాలన్న ఇస్తానని వేడుకుంది. కానీ కిడ్నాపర్ దీక్షిత్‌రెడ్డిని వదల్లేదు. కిడ్నాప్‌కు గురైన మరుసటి రజు మధ్యాహ్నం వరకు రెండుసార్లు కాల్ చేసిన కిడ్నాపర్ ఆ తర్వాత మళ్లీ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు మరింత ఆందోళనలో పడిపోయారు. వారు అడిగిన డబ్బులన్ని సిద్దం చేసుకున్న తల్లిదండ్రులు..కిడ్నాపర్లు చెప్పిన అడ్రస్‌కు వెళ్లారు.అంతలోనే కిడ్నాపర్లు ఫోన్ చేసిన మరో ప్రాంతానికి రావాలని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లినా కిడ్నాపర్లు రాలేదు. డబ్బులు సిద్దంగా ఉన్నాయని, తీసుకోవడానికి రావాలని చెప్పినా ఎంతకీ రాలేదు. దీంతో తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకు వేచి చూశారు.
మరో వైపు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని విధాలుగా ప్రయత్నించారు. నాలుగు రోజులుగా పోలీసులకు కిడ్నాపర్లు దొరకకుండా ముచ్చెమటలు పట్టించారు. దీక్షిత్‌ను కాపాడేందుకు ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, వంద మంది కానిస్టేబుళ్ల రంగంలోకి దిగారు. అలాగే నాలుగు ఇంటెలిజెన్స్ బృందాలతో పాటు నాలుగు ఎస్‌ఐబీ టీమ్‌లు సైతం ఈ కేసును ఛేదించేందుకు తీవ్రంగా శ్రమించారు. నిందితులు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేయడంతో ట్రేస్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో హైదరాబాద్ నుంచి సైబర్ క్రైం పోలీసులతో పాటు ఐటీ కోర్ టీమ్ కూడా మహబూబాబాద్‌కు చేరుకుంది.
డబ్బులు సిద్దం చేసుకున్నర తర్వాత బుధవారం కిడ్నాపర్లు ఫోన్ చేసి తల్లి ఆ డబ్బును చూపిస్తున్న దృశ్యాలు అందరిని కంటతడిపెట్టించాయి. చివరికి మహబూబాబాద్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోని గుట్టలోబాలుడిని హత్య చేసి పెట్రోల్‌తో మృతదేహాన్ని కాల్చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కిడ్నాప్‌కు సూత్రధారరుడు మనో్జ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పో్లీసులు అదుపులోకి తీసుకున్నారు. మందసాగర్ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది.