డీసీపీ ఆఫీసు ఎదుట‌ రైతుల ఆందోళ‌న‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 7:09 AM GMT
డీసీపీ ఆఫీసు ఎదుట‌ రైతుల ఆందోళ‌న‌

శంషాబాద్ : శంషాబాద్ డీసీపీ ఆఫీసు వద్ద రైతులు అందోళన చేప‌ట్టారు. తమ వ్యవసాయ భూములలో పండించిన పంటను ధ్వంసం చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళ‌న చేప‌ట్టారు. అయితే.. అందోళనకు దిగిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరైతే భూములను లాక్కున్నారో వారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు రైతులకు సూచించారు. అయినా ఆందోళ‌న విర‌మించ‌ని రైతులు డీసీపీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.

Next Story
Share it