పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్ వార్నర్‌.. రెండో రోజు కూడా అదే దూకుడును కొనసాగించాడు. ప‌నిలో ప‌నిగా త‌న కెరీర్ లో మొద‌టి ట్రిపుల్ సెంచరీ (335, 39×4, 1×6 )ని పూర్తిచేసుకున్నాడు. 166 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వార్నర్‌.. దాటిగా ఆడి ట్రిపుల్ సెంచ‌రీ నమోదు చేశాడు.

ఇదిలావుంటే.. ఓపెన‌ర్ జో బర్న్స్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగిన త‌ర్వాత‌ క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్‌.. వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. వార్నర్‌-లబూషేన్‌ల జోడి 361 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ తొలి టెస్టులో కూడా సెంచ‌రీలు బాదారు. అదే జోరును రెండో టెస్టులో కూడా కంటిస్యూ చేశారు. వార్న‌ర్ త్రిశ‌త‌కంతో భారీ స్కోరు సాధించిన‌ ఆస్ట్రేలియా.. 589/3 వ‌ద్ద తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్సును ప్రారంభించిన పాక్‌కు ఆదిలో ఎదురుదెబ్బ త‌గిలింది. 3 ప‌రుగుల వ‌ద్ద‌ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ వికెట్‌ను కోల్పోయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.