మొన్న బుట్ట‌బొమ్మా.. నేడు రాములో రాములా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2020 1:11 PM GMT
మొన్న బుట్ట‌బొమ్మా.. నేడు రాములో రాములా

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ టిక్‌టాక్‌లో రెచ్చిపోతున్నాడు. త‌న విధ్వంస‌క బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రించిన‌ ఈ క్రికెట‌ర్.. క‌రోనా సెల‌వుల్లో టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ ర‌ద్దు కావ‌డంతో.. ప్ర‌స్తుతం వార్న‌ర్ ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా కాలం గ‌డుపుతున్నాడు. త‌న ముద్దుల కూతురు కోరిక మేర‌కు టిక్‌టాక్‌లో అడుగు పెట్టాడు.

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కెప్టెన్ అయిన వార్న‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రితం ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మొన్న అల్లు అర్జున్ న‌టించిన 'అల‌వైకుంఠ పురంలో'ని 'బుట్ట బొమ్మ' పాటకు చిందేసిన వార్నర్.. ఆ తర్వాత సన్నజాజి, మహేశ్ బాబు న‌టించిన 'పోకిరి' చిత్రంలో డైలాగ్‌తో అదరగొట్టాడు. తాజాగా 'రాములో రాముల' సాంగ్‌కు ఫ్యామిలీతో క‌లిసి చిందేసాడు.

రాములో రాముల పాట‌కు తన భార్య క్యాండీస్‌, కూతురి ఇండిరేతో కలిసి ఈ పాట‌కు చిందులేశాడు. ముందు వరుసలో వార్నర్‌-కాండీస్‌లు డ్యాన్స్ చేయ‌గా.. వెనుక ఇండిరే ఇర‌గ‌దీసింది. అయితే ఈ సాంగ్‌కు తగ్గట్లు ఈ ముగ్గురు కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం. పాట చివ‌ర్లో వార్న‌ర్ అల్లు అర్జున్ స్టైల్‌లో టోపీని తీయ‌డం ఇక్క‌డ విశేషం.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వార్న‌ర్ డ్యాన్స్‌కు అత‌ని అభిమానుల‌తో పాటు బ‌న్నీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఐపీఎల్ లేకున్నా నీ ఎంట‌ర్‌టైన్ మిస్స‌వ‌టం లేదు వార్న‌ర్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా.. ఉప్పల్ గ్రౌండ్ లో సెంచరీలు చేసే టోడు.. ఉప్పల్ బాలు లా తయారయ్యాడని మ‌రికొంద‌రు వ్యంగ్య బాణాలు సందిస్తున్నారు. మ‌రికొక అభిమాని వార్న‌రో వార్న‌రా.. నీ టిక్‌టాక్‌లు ఏందిరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story