హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు మురగదాస్
By సుభాష్ Published on 6 Feb 2020 8:47 AM GMTసూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్టార్ దర్శకుడు మురగదాస్ నిర్మించిన చిత్రం 'దర్బార్'. ఎన్నో వివాదాల మధ్య ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కలెక్షన్ల విషయానికొస్తే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేసింది. ఎన్నో అంచనాలతో ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని వినియోగదారులు భారీ రేటుకు కొనుగోలు చేశారు. కాగా, సరైన సమయంలో కలెక్షన్లు రాకపోవడంతో దాదాపు 25 కోట్ల వరకు వినియోగదారులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ నష్టాలను దర్శకుడు మురగదాస్, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లు భరించాలంటూ వారు డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ విషయంలో ముగదాస్‌ను కలిసేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాగా, ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ వచ్చింది. ఈ క్రమంలో మురగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల నుంచి నాకు ప్రాణహాని ఉందని, నాకు పోలీసు భద్రత ఏర్పాటు చేయాలంటూ మురగదాస్ హైకోర్టుకు కోరారు.