గాయని చిన్మయి నామినేషన్‌ తిరస్కరణ

By Newsmeter.Network  Published on  6 Feb 2020 6:48 AM GMT
గాయని చిన్మయి నామినేషన్‌ తిరస్కరణ

దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సింగర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యికి చుక్కెదురైంది. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ ఉందని చెప్పి ఎన్నిక‌ల అధికారి ఆమె నామినేషన్‌ ను తిర‌స్క‌రించారు. యూనియన్‌ ఎన్నికలలో రాధార‌వికి పోటీగా నిల‌బ‌డుతున్నానంటూ చిన్న‌యి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ యూనియన్‌ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి.

యూనియన్‌ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాగా చిన్మయి నామినేషన్‌ తిరస్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి.

గ‌తంలో మీటూ వివాదంలో చిన్మ‌యి.. రాధార‌విపై ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్‌ నుంచి తప్పించారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి.. తన నామినేషన్‌ తిరస్కరించడం పై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

Next Story