ఇక్క‌డ ఉంది నేను.. వికెట్లు తీస్తా.. ట్రోఫీని సాధిస్తాం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 4:35 AM GMT
ఇక్క‌డ ఉంది నేను.. వికెట్లు తీస్తా.. ట్రోఫీని సాధిస్తాం..!

ఐపీఎల్ 2020 కి జ‌రిగిన‌ వేలంలో దక్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్ డేల్ స్టెయిన్‌ను చివరి నిమిషంలో ఆర్సీబీ కనీసధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ వేలంలో త‌న‌ను కొనుగోలు చేయడంపై డేల్ స్టెయిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా ఆర్సీబీ అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా కొంత‌మంది ఆర్సీబీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు డేల్ స్టెయిన్‌ స్పందించాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తుందా? అని ఓ అభిమాని అడిగాడు. దీనికి స్టెయిన్ స్పందిస్తూ.. తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను. ఈసారి ఎక్కువ వికెట్లు తీస్తాను. వికెట్లతో పాటు ట్రోఫీని కూడా సాధిస్తాం.. అంటూ స‌మాధాన‌మిచ్చాడు. అంతేకాదు వేలంలో ఆర్సీబీ న‌న్ను ఎంచుకోవ‌డం ప‌ట్ల‌ "ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగిందని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇదిలావుంటే.. డేల్ స్టెయిన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆర్సీబీ స్టెయిన్‌ను తీసుకోవ‌డం ద్వారా త‌మ బౌలింగ్ విభాగాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. ఇప్ప‌టికే రిచర్డ్‌సన్‌, మోరిస్‌, ఉదానలతో బ‌లంగా ఉన్నా స్టెయిన్ రాక‌తో మ‌రింత ప‌టిష్టం కానుంది.

2019 సీజన్‌లో కూడా ఆర్సీబీ తరుపున ఆడిన‌ డెల్ స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్‌లే మాత్ర‌మే ఆడాడు. గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో 2020 వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. త‌ద‌నంత‌రం వేలంలో తిరిగి కనీస ధ‌ర అయిన రూ.2 కోట్ల‌కే కొనుగోలు చేసింది. స్టెయిన్‌ను తీసుకునే ముందు కెప్టెన్ కోహ్లీతో చర్చించామ‌ని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌ మైక్ హెసన్‌ అన్నాడు.

Next Story
Share it