ప్యారిస్‌: ” కల కనాలి. ఆ కలలు సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి.” ఈ మాటలను ఎంతో ధైర్యంతో నిజం చేసింది డైసీ మే. కాళ్లు లేకపోయిన తన కలలకు జీవం పోసుకుంది. ప్యారిస్‌ ఫ్యాషన్‌లో తళుక్కున ఓ అందమైన మెరుపులా మెరుస్తుంది. అందరిచేత హ్యాట్పాఫ్ అంటూ చప్పట్లు కొట్టించుకుంటుంది.

Related image

ఫ్యాషన్ రంగం అంటేనే అందంగా ఉండాలి. బాగా కష్టపడాలి. అయినా..గుర్తింపు వస్తుందో రాదో అనే భయం ఓ మూలన ఉంటుంది. కాని..డైసీ మాత్రం కాళ్లు లేకపోయినా ఫ్యాషన్‌ రంగాన్నే ఎంచుకుంది. కష్టపడింది. తన కలలకు ప్రాణం పోసుకుంది. ‘ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌ -2019’లో తళుక్కున మెరిసింది. ‘లాలూ ఎట్ జీజీ’ సంస్థ బాలల వస్త్రధారణ ప్రదర్శనలో పాల్గొంది.

Image result for handicapped paris catwalk girl daisy may

డైసీ మే…ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హమ్. 18 నెలల వయసులోనే మోకాళ్ల కింది భాగం ఎముకల్లో లోపాలతో డాక్టర్లు కాళ్లు తీసేశారు. అయినా..డైసీ ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పిల్లల ఫ్యాషన్ రంగంలోకి కాళ్లు లేకపోయినా అడుగు పెట్టింది.

Related image తానే మేకప్ వేసుకుంటుంది. తానే జుట్టు దువ్వుకుంటుంది. తానే..తన కృత్రిమ కాళ్లను అమర్చుకుంటుంది. కొన్ని నెలల నుంచి బ్రిటన్‌ వస్త్ర సంస్థలకు మోడలింగ్ చేస్తుంది. డైసీకి వస్తున్న మంచి పేరును చూసి ఆమె తండ్రి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. తన కూతురు  భవిష్యత్తుకు  ఢోకాలేదని సంబర పడుతున్నాడు.

Image result for handicapped paris catwalk girl daisy may

Image result for handicapped paris catwalk girl daisy may

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.