బంగాళాఖాతంలో అల్పపీడనం

By సుభాష్  Published on  13 May 2020 11:55 AM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మే 16వ తేదీ ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బలపడిన అల్పపీడనం పెనుతుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది భారత వాతావరణ శాఖ. మరో వైపు ఎన్‌డీఎంఏ కూడా వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఈ అల్ప పీడనం ప్రభావంతో రానున్న శుక్ర, శనివారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉంది.

ఈ అల్పపీడ‌నం ప్ర‌భావంతో వ‌చ్చే శుక్ర‌, శ‌ని వారాల్లో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో మాత్రం భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా బ‌ల‌మైన ఈదురు గాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ అధికారులు తెలిపారు.

Next Story