టెన్షన్‌.. టెన్షన్‌.. తీరాన్ని తాకిన 'అంఫన్‌'

By సుభాష్  Published on  20 May 2020 11:38 AM GMT
టెన్షన్‌.. టెన్షన్‌.. తీరాన్ని తాకిన అంఫన్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్‌ తుఫాను గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అంఫన్‌ తుఫాను సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర నైరుతి వైపు అంఫన్‌ తుఫాను దూసుకొస్తుందని, పారదీప్‌కు దక్షిణ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.

తీరం దాటే సమయంలో నాలుగు గంటలు చాలా కీలకంగా మారే అవకాశ ఉందని అధికారులు తెలిపారు. ఈ నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భయంకరమైన గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. ఇప్పటికే బెంగాల్‌, ఒడిశాలోని 8 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దాదాపు రెండు రాష్ట్రాల్లో దాదాపు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

కాగా, పశ్చిమ బెంగాల్‌లోని దిశ ప్రాంతానికి 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్‌ – బంగ్లాదేశ్‌ మధ్య హతీయ ఐలాండ్‌ ఏరియాలో క్రమ క్రమంగా బలహీనపడి అతీ తీవ్ర తుఫాను తీరం తాకిందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా ఏపీలో 125 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అన్ని పోర్టుల్లో

మూడవ నెంబర్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొస్తా జిల్లా భారీ వర్షాలు కురిసే

అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెల్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

Next Story
Share it