వామ్మో సైబర్ నేరగాళ్లు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 5:45 AM GMT
వామ్మో సైబర్ నేరగాళ్లు...!

* సీఈఓ గొంతుతో మేనేజర్ ను మోసం చేసిన హైటెక్ నేరగాళ్లు

* అకౌంట్లో నుంచి $234,000 డాలర్స్ చోరీ

ఆధునిక టెక్నాలలజీ సహాయంతో నేరగాళ్ళు హైటెక్ నేరాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్ నుంచి నకిలీ, నిజమైన వీడియో, ఆడియో లను గుర్తించడం ఇప్పటికే ఆసాధ్యంగా మారుతోంది. ఇప్పుడు నకిలీ వాయిస్ టెక్ వాడకం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్వరాన్ని అనుకరించి వాయిస్ కాల్ మోసంతో (“వాయిస్ ఫిషింగ్”) కార్పొరేట్ సంస్థలను టార్గెట్ చేస్తూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు దొంగలు.

ఆడియో డీప్‌ఫేక్‌లు వ్యక్తుల స్వరాల అనుకరణ చాలా ఖచ్చితమైనవిగా ఉంటున్నాయి. నకిలీ, అసలైనదా కనుక్కోలేని పరిస్థితి ఉంది. నేరస్థులు వాణిజ్య పరంగా అందుబాటులో ఉన్న వాయిస్-జనరేటింగ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ( ఏ ఐ) సాఫ్ట్‌వేర్ సహాయంతో మోసం చేస్తున్నారు. జర్మన్ మాతృ సంస్థ యూకే ఆధారిత ఇంధన సంస్థను లక్ష్యంగా చేసుకున్నారు మోసగాళ్ళు.

యూకేలోని సంస్థ (సీఈవో) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఆ సంస్థ యజమాని స్వరాన్ని అనుకరింస్తూ తక్షణమే వైరింగ్ చేయటానికి హంగేరియన్ సంస్థకు నిధులు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ సంస్థ నగదును ఒక గంటలో తిరిగి చెల్లిస్తుందని హామీ ఇవ్వడంతో సీఈఓ సందేహించక మాయగాళ్ళు అడిగిన మొత్తాన్ని చెల్లించాడు.

ఈసారి కేటు గాళ్ళు జర్మనీలోని సంస్థ సీఈఓ గొంతుతో మళ్లీ ఫోన్ చేసి హంగేరియన్ లోని వైర్ల సంస్థకు అత్యవసరంగా నిధులు బదిలీ చేయాలన్నారు. సమయం గడుస్తున్నా అకౌంట్లోకి తిరిగి డబ్బులు చేరలేదు. పైగా మళ్లీ డబ్బులు అడిగారు. దీంతో యూకే సీఈవో డబ్బులు ట్రాన్సఫర్ చేసేందుకు నిరాకరించాడు.

మోసపోయిన కార్పొరేట్ సంస్థకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ చేసిన యూలర్ హీర్మేస్ గ్రూప్ బీమా సంస్థ ఆ కంపెనీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. నష్టపోయిన మొత్తాన్ని బీమా సంస్థ చెల్లించింది. సైబర్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ఉటంకిస్తూ ఈ సంఘటన మార్చిలో జరిగిందని తెలిపింది. అయితే... అందులో పాల్గొన్న పార్టీల పేర్లు వెల్లడించలేదు.

స్వరాలను అనుకరించే సాధనాలు మరింత వాస్తవికంగా మారడంతో ఆర్ధిక నేరగా ళ్ళు వాటిని తమ స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఫోన్‌లో ఐడెంటిటీలను ప్రదర్శించడం ద్వారా పర్సనల్ సమాచారాన్ని బహిర్గతం చేసి బెదిరింపులకు పాల్పడే అవకాశం కూడా ఉంది.

ఏఐ ని ఉపయోగించి వాయిస్-జనరేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా జర్మనీ సీఈఓ కంఠాన్ని విజయవంతంగా అనుకరించడంగింది. ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ దాడులు విజయవంతమైతే మోసాలు సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతాయి.

భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోసాలు, దాడులతో బహుళజాతి సంస్థలకు, బడా వ్యాపారస్తులకు పెద్ద తలనొప్పిగా మారనుంది.

Next Story