గ్రామంలో మొసలి ప్రత్యక్షం.. ఆ తరువాత ఏం జరిగింది..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Sep 2019 8:49 AM GMT
నిజామాబాద్ జిల్లా : మెండోరా మండలం ధూద్ గాం గ్రామంలో మొసలి ప్రత్యక్షమయింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరదలలో కొట్టుకువచ్చిన మొసలిని గ్రామంలోని బ్రిడ్జి పై కనపడింది. మొసలిని చూసిన గ్రామస్తులు వణికిపోయారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. గ్రామస్తులు ద్వారా సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సాయంతో మొసలిని బంధించారు. మొసలిని ఏదైనా జలాశయంలో వదిలేస్తామని అధికారులు చెప్పారు.
Next Story