ఫోన్‌ మాట్లాడుతుంటే విసిగించాడని.. రెండేళ్ల కొడుకుని చంపిన తల్లి

జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతుంటే విసిగించాడని రెండేళ్ల కొడుకుని చంపింది ఓ తల్లి.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 3:15 PM GMT
woman, murder,  two years son,  disturbing call, jarkhand,

ఫోన్‌ మాట్లాడుతుంటే విసిగించాడని.. రెండేళ్ల కొడుకుని చంపిన తల్లి 

జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మరొకరితో ఘర్షణ గురించి ఫోన్లో మాట్లాడసాగింది. అక్కడే ఉన్న రెండేళ్ల కుమారుడు తల్లి దగ్గరకు పదేపదే వెళ్తూ విసిగించాడు. దాంతో విచక్షణ కోల్పోయిన సుదురు మహిళ రెండేళ్ల కొడుకు గొంతు పిసికి చంపేసింది. ఆ తర్వాత విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. కొడుకు అచేతనంగా పడి ఉండటాన్ని గమనించి తండ్రి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అఫ్సానా ఖాతూన్‌కు ఆరేళ్ల క్రితం నిజాముద్దీన్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు నాలుగేళ్లు కాగా.. చిన్న కొడుకు వయసు రెండేళ్లు. అయితే.. భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. ఈ క్రమంలోనే భర్తతో గొడవ పడింది అఫ్సానా ఖాతూన్. గొడవ తర్వాత కోపంగా గదిలోకి వెళ్లి రూమ్‌ లాక్‌ వేసుకుంది. ఆ ఘర్షణ గురించి ఇతరులు ఎవరికో ఫోన్‌ చేసి చెప్పసాగింది. అయితే.. అప్పటికే అదే గదిలో ఉన్న చిన్నకుమారుడు తల్లిదగ్గరికి పదేపదే రావడం చేశాడు. దాంతో విసిగిపోయిన తల్లి కోపంతో ఏం చేస్తుందో కూడా తెలియకుండా.. ఆ చిన్నోడి గొంతు నులిమింది. ప్రాణాలు పోయేలా చేసింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు డోర్లు తీయలేదు.

చివరకు భర్త నిద్రపోయేందుకు గదిలోకి పిలిచింది అఫ్సానా. కొడుకు అచేతనంగా పడిఉండటాన్ని చూశాడు. ఏమైందని భార్యను అడిగాడు. ఏమో నిద్రపోతున్నట్లు ఉన్నాడని చెప్పింది. ఎంతసేపటికీ కదలకపోవడంతో.. తండ్రికి అనుమానం వచ్చే లేపే ప్రయత్నం చేశాడు. కానీ.. ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. దాంతో భయపడిపోయి నిజాముద్దీన్‌ కొడుకుని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. బాబుని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. కాగా.. అఫ్సానా మామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కుమారుడిని చంపలేదని అఫ్సానా విచారణలో తెలిపింది. ఏడుస్తున్నాడన్న ఆగ్రహంతో తోశాననీ.. బెడ్‌పై నుంచి కిందపడి చనిపోయాడని తెలిపింది. ఈ సంఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story