ముంబైలో ఓ బాలుడు సైకిల్ స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి గోడకు ఢీకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో స్థానిక సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతి చెందిన బాలుడిని 16 ఏళ్ల నీరజ్ యాదవ్‌గా గుర్తించారు. బాలుడు మీరా-భయందర్ వద్ద కోట యొక్క ప్రాకారాలపై వేగంగా వెళ్తుండగా.. గోడను ఢీకొట్టి కుప్పకూలిపోయాడు.
మీరా రోడ్డు సమీపంలో.. నివసించే నీరజ్ సోమవారం సైకిల్‌పై ఘోడ్‌బందర్ కోటకు వెళ్లాడు. ఏటవాలుపై వేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ఓ ఇంటి గేటు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం సమీపంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు గా కేసు నమోదైంది