Vikarabad: రూ.7.95 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లు పట్టివేత
వికారాబాద్ పోలీసులు ఫేక్ నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 July 2024 1:15 PM GMTVikarabad: రూ.7.95 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లు పట్టివేత
వికారాబాద్ పోలీసులు ఫేక్ నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. వారి వద్ద నుండి రూ.7.95 లక్షల ఫేక్ నకిలీ నగదు తో పాటు ఫేక్ నోట్లు తయారు చేసే కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసు కున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జగదీష్ (42) అనే వ్యక్తి ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా జహీరాబాద్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశాడు. అప్పుడు బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినందుకు ఇతనిపై కేసు నమోదు అయ్యింది. కాగా ఒక నెల రోజులు సంగారెడ్డి జిల్లా కందిజైలులో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన బడుగంటి వీర వెంకటరమణ అలియాస్ వెంకీ (27) అనే వ్యక్తి వెల్డర్ గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతను నకిలీ నోట్లు చలామణి చేసినందుకు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అలాగే గంజాయి అక్రమంగా రవాణా చేసినందుకు హైదరాబాదులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇతను మూడు నెలలు సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్నాడు.
ఆ సమయంలో వెంకీకి జగదీష్ తో పరిచయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రగల్లపాటి శివకుమార్ (43) అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. వీరి ముగ్గురికి చంద్రయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివకుమార్ ఈ నలుగురు కలిసి సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. పథకం ప్రకారమే ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేసి వాటిని వికారాబాద్ జిల్లా తాండూరులో చలామణి చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులకు విశ్వాసనీయమైన సమాచారంతో వెంటనే దాడులు చేసి ఈ నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి వద్ద నుండి 7,95,000 విలువ గల 1590 నకిలీ రూ.500 నోట్లు, కంప్యూటర్, ప్రింటర్, పేపర్, రిబ్బన్, ఐదు మొబైల్స్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు చేసిన నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి వెల్లడించారు.
వికారాబాద్ పోలీసులు ఫేక్ నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. వారి వద్ద నుండి రూ.7.95 లక్షల ఫేక్ నకిలీ నగదు తో పాటు ఫేక్ నోట్లు తయారు చేసే కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసు కున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. pic.twitter.com/imszc66UYX
— Newsmeter Telugu (@NewsmeterTelugu) July 20, 2024