మహిళపై అత్యాచారం.. అర్ధనగ్నంగా కి.మీ పరుగెత్తిన బాధితురాలు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగు చూసింది.

By Srikanth Gundamalla  Published on  22 Jun 2024 12:15 PM IST
ujjain, gang rape, two accused arrested, woman,

మహిళపై అత్యాచారం.. అర్ధనగ్నంగా కి.మీ పరుగెత్తిన బాధితురాలు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ గిరిజన మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత మహిళ అర్ధనగ్న స్థితిలో సుమారు కిలోమీటరు దూరం పారిపోయిందని చెబుతున్నారు. కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీల ప్రాబల్యం ఉన్న దిండోరి వాసిగా బాధితురాలిని గుర్తించారు. అత్యాచారానికి గురైన మహిళ చాలా పేద కుటుంబానికి చెందినది. ఉద్యోగం వెతుక్కుంటూ భర్తతో కలిసి ఉజ్జయిని చేరుకుంది. ఇద్దరూ పని వెతుక్కుంటూ ఇందిరా నగర్ చౌక్ వెళ్లారు. ఇక్కడ రవి బైక్ పై వెళ్తూ.. పని సాకుతో ఇద్దరినీ తన బైక్ పై 14 కిలోమీటర్ల దూరంలోని ఉన్న తాజ్ పూర్ గ్రామంలోని ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ శుభ్రం చేయాలని మహిళతో చెప్పాడు. ఆ తర్వాత తినడానికి ఏదైనా తెస్తామని భర్తను తీసుకొని బయటకు వెళ్లాడు నిందితుడు.

మహిళ భర్తతో పాటు రవి బయటకు వెళ్లిన తర్వాత.. రవి స్నేహితుడు ఇమ్రాన్‌ ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. ఇమ్రాన్‌ మహిళ వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రవి కూడా భర్తను గ్రామానికి దూరంగా వదిలేసి వచ్చి అతనూ మహిళపై రేప్‌నకు పాల్పడ్డాడు. ఇక బాధితురాలు ఎలాగోలా కామాంధుల నుంచి తప్పించుకుని ఫౌంహౌస్‌ నుంచి బయటకు పారిపోయింది. అర్ధనగ్నంగా పరిగెత్తి గనిలో పనిచేస్తున్న కార్మికుల వద్దకు చేరుకుంది. ఇక స్థానికులు మహిళకు సాయం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను తీసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రంతా సోదాలు చేశారు పోలీసులు. దాదాపు 20 మంది పోలీసులు టీమ్‌గా ఏర్పడి గాలింపు చేపట్టారు. రవి, ఇమ్రాన్‌లను గుర్తించారు. అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story