దారుణం.. ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం

యువతిని ఇంటికి పిలిచి మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Nov 2023 5:17 PM IST
two boys,  girl, rape,

దారుణం..ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ఇంటికి పిలిచి మంచిగా మాట్లాడారు. తెలిసినవారు కావడంతో ఆ యువతి కూడా కాసేపు అక్కడే కూర్చొని ముచ్చటించింది. ఆ తర్వాత యువతికి కూల్‌ డ్రింక్‌ ఆఫర్‌ చేయడంతో.. ఆమె కూడా ఒప్పుకుని దాన్ని తాగింది. అప్పటికే నిందితులు కూల్‌ డ్రింక్‌లో మత్తు కలిపారు.. దాంతోఓ సదురు స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నిందితులు ఇద్దరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ముంబైలోని బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్ క్వార్టర్స్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి బార్క్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు కూతురుతో కలిసి అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఉద్యోగ పనిలో బాగంగా అతను మరో ప్రాంతానికి వెళ్లాడు. దాంతో.. యువతి ఇంట్లో ఒక్కతే ఉండిపోయింది. అయితే.. నిందితుడి తండ్రి కూడా బార్క్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి ఉంటున్న భవనంలో తాను ఉంటున్నాడు. ఇద్దరికి ముఖ పరిచయం కూడా ఉంది.

యువతితో పాటు నిందితుడు తండ్రి కూడా విధి నిర్వహణలో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లారు. ఈక్రమంలో నిందితుడు తన స్నేహితుడిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆహారం వండుకునేందుకు ఇండక్షన్ స్టవ్‌ అవసరం అయ్యింది. దాంతో.. పక్కనే ఉన్న యువతి ఇంటి నుంచి తీసుకురావాలని ఆమెను కోరారు. దాంతో.. వాటిని యువతి తీసుకుని వెళ్లింది. కాసేపు అక్కడే ఉండి వారితో మాట్లాడింది. ఈ క్రమంలోనే నిందితులు ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చారు. తాగాలని కోరారు. తెలిసిన వారే కావడంతో ఆమె కూడా ఒప్పకుని డ్రింక్‌ తాగింది. కాసేపటికే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ యువతిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున స్పహలోకి వచ్చిన అఘాయిత్యం జరిగిందని గుర్తించింది. బోరున విలపించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు చెంబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితులను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Next Story