ఇంటి పెద్ద మరణంతో ఆ ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు బలవన్మరణం

Three members of Family Suicide.. ఓ ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా

By సుభాష్  Published on  1 Dec 2020 5:47 AM GMT
ఇంటి పెద్ద మరణంతో ఆ ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు బలవన్మరణం

ఓ ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా అందరిని కంటతడిపెట్టించింది. నీ వెంటే మేమూ అంటూ ఆ కుటంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మధురైలో సోమవారం చోటు చేసుకుంది. తిరుచ్చి సత్యమూర్తినగర్‌కు చెందిన అరుణ్‌పాండియన్‌

(45) కాంట్రాక్టర్‌. ఆయనకు భార్య వలర్మతి (39), కుమార్తెలు అఖిల (18), ప్రీతి (17) ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అరుణ్‌పాండియన్‌ అనారోగ్యానికి గురై మధురైలో చికిత్స పొందాల్సి రావడంతో మలై స్వామిపురంలోని వల్రమతి సోదరి సరస్వతి ఇంటికి పై అంతస్తులో కొన్ని నెలలుగా ఉంటున్నారు.

ఇక అనారోగ్యం కారణంగా జూలై లో అరుణ్‌పాండియన్‌ మరణించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర మనోవేదకు గురవుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అరుణ్‌ పాండియన్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు ఒకే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము పెంచుకుంటున్న శనకాన్నిసైతం గొంతు నులిమి హతమార్చారు. సోమవారం ఉదయం ఎంత సేపైనా వలర్మతి, పిల్లలు బయటకు రాకపోవడంతో సరస్వతి భర్త గణేష్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి ఇంటి తలపులు బద్దలు కొట్టి చూడగా, తల్లి, కుమార్తెలు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. అయితే ఫ్యామిలీ ఫోటో వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తమ ఆస్తులను తన తల్లి లక్ష్మికి అప్పగించాలని వలర్మతి పేర్కొంది. తమ అంత్యక్రియలను తల్లి లక్ష్మి చేతుల మీదుగా చేయించాలని, తమతో పాటు శునకాన్ని కూడా ఖననం చేయాలని లేఖలో కోరారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి లేకపోవడం తీవ్ర మనోవేదకు గురయ్యామని, అందుకే నాన్న వద్దకే వెళ్తున్నామని ఇద్దరు కుమార్తెలు లేఖలో పేర్కొనడం అందరి హృదయాలను కదిలించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధురై జీహెచ్‌ఎంసీకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story