కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య.. ప్రియురాలే కారణమంటూ వీడియో

Telugu man suicide in Canada .. తెలుగు యువకులు ఇతర దేశాలకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రియురాలు మోసం

By సుభాష్  Published on  16 Nov 2020 9:33 AM IST
కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య.. ప్రియురాలే కారణమంటూ వీడియో

తెలుగు యువకులు ఇతర దేశాలకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రియురాలు మోసం చేసిందనే కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని నైట్రోజన్‌ గ్యాస్‌ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నగరానికి చెందిన ప్రణయ్‌ అనే యువకుడు కొంత కాలంగా కెనడాలో ఉంటున్నాడు. అయితే ప్రియురాలు మోసం చేసిందంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ తన సామాజిక బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేశాడు. తన అవయవాలను దాణం చేయాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలని తల్లిదండ్రులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. కాగా, హబ్సిగూడకు చెందిన ప్రణయ్‌.. ఆత్మహత్యకు పాల్పడటంతో సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తనకు హెచ్‌ 1 వీసా రావడంతో మోసం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రియురాలి మోసానికి తాను బలయ్యానని 15 నిమిషాల పాటు ఉన్న ఓ వీడియోను తయారు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు.

Next Story