కుమ్రంభీం జిల్లాలో దారుణం.. మూడేళ్ల పాపపై అత్యాచారం
మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 2 July 2024 1:52 AM GMTకుమ్రంభీం జిల్లాలో దారుణం.. మూడేళ్ల పాపపై అత్యాచారం
మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు చిన్నారులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
సిర్పూర్ టి. మండలం వెంకట్రావుపేట్లో ఈ దారుణం జరిగింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను.. అదే గ్రామానికి బుడే రాజేందర్ (24) అనే యువకుడు బాలికపై కన్నేశాడు. మిగతా పిల్లలను కొట్టి బలవంతంగా మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లాడు. దాంతో.. భయంతో మిగతా పిల్లలు ఏడుస్తూ బాధిత చిన్నారి తండ్రికి వెళ్లి చెప్పారు. దాంతో.. వెంటనే ఆ తండ్రి రాజేందర్ కోసం వెతికారు. నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా చిన్నారి రక్తస్రావంతో ఏడుస్తూ కనిపించింది. తండ్రి వెంటనే బాలికను సిర్పూర్ టి పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితుడు రాజేందర్‌పై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ ఆదిక్ పాషా, ఎస్ఐ విచారణ ప్రారంభించారు. ఆదివారం ఈ సంఘటన జరిగిందని వెల్లడించారు పోలీసులు. సోమవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.