భార్య, పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌మెన్

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 8:59 AM GMT
siddipet, collector gunman, family suicide ,

 భార్య, పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌మెన్  

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. మృతుడు కలెక్టర్‌ గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న తన భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వద్ద ఆకుల నరేశ్‌ గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పేర్లు రేవంత్, హిమశ్రీ. భార్యా పిల్లలతో కలిసి చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. నరేశ్‌ ఆన్‌ డ్యూటీలో ఉండాలి. కానీ.. అతను రిపోర్ట్‌ చేయలేదు. మిగతా సిబ్బంది ఫోన్‌ చేశారు. కానీ అతను లిఫ్ట్‌ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన మిగతా సిబ్బంది ఏం జరిగిందనీ ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంట్లో ఇద్దరు పిల్లలతో పాటు.. దంపతులు రక్తపు మడుగులో ఉండటాన్ని చూశారు. ఆ తర్వాత వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్ పాటిల్ వద్ద గన్మెన్‌గా పనిచేస్తున్న నరేశ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు చేస్తుండే వాడు. ఆ క్రమంలోనే పెద్దఎత్తున అప్పులు చేసి మరీ ఆడాడు. అన్నీ ఓడిపోవడంతో లాస్‌ అయ్యాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవనీ పోలీసులు చెప్పారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉప్పు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు నరేశ్‌ అత్తింటి వారు సాయం చేసినా పూర్తిగా తీరలేదు. ఇటీవల తమకున్న ల్యాండ్‌ను అమ్మేశారు. అయినా.. ఇంకా కొన్ని మిగిలి ఉండటంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా గొడవ తారాస్థాయికి చేరింది. ఆగ్రహానికి గురైన నరేశ్‌.. స్కూల్‌కు వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. అదే కోపంలో భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

ఈ సంఘటనపై మాట్లాడిన సీపీ శ్వేత.. సర్వీస్‌ రివాల్వర్‌తోనే కుటుంబ సభ్యులను కాల్చి నరేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నరేశ్‌కు అప్పులు ఉన్నాయని ప్రాథమికంగా తేలిందన్నారు. నరేశ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామనీ.. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు చెబుతామని సీపీ శ్వేత వెల్లడించారు.

Next Story