రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టివేత

తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 1:06 PM IST
rajendra nagar, police, seize, ganja chocolates,

రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టివేత 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్‌ ఎక్కడా సరఫరా కాకుండా చూడాలని ఆదేశాలను జారీ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. గంజాయి సమాచారం అందిన వెంటనే రైడ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబుడోతంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పాతబస్తీలో కూడా 14 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయిని సరఫరా చేస్తూ.. స్కూల్‌ పిల్లలు, కాలేజ్‌ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తోల్‌కట్టా వద్ద ఓ షెడ్డుపై పోలీసులు రైడ్ చేశారు. అక్రమంగా చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సౌరభ్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇతనితో పాటుగా ముస్తబా అలీఖాన్, మరో వ్యక్తిని కలిపి మొత్తం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

ఇక పాతబస్తీలోని ఉప్పుగూడలో రూ.5లక్షల విలువైన 14 కిలోల గంజాయిని శంషాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. గంజాయితో పాటుగా కారు, రెండు బైక్‌లు, రెండు మొబైల్‌ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story