రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన రాధా రమణి ఆత్మహత్యాయత్నం

Radha ramani Suicide attemp.. బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రాధా రమణి

By సుభాష్  Published on  17 Nov 2020 4:53 AM GMT
రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన రాధా రమణి ఆత్మహత్యాయత్నం

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రాధా రమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగలేదంటూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఘటనకు పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. రఘునందన్‌తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

అత్యాచారం కేసులో తనకు న్యాయం చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఆమె.. అనంతరం పోలీసు స్టేషన్‌ కు వెళ్తానంటూ వీడియోలో పేర్కొంది. అయితే రాధా రమణికి చికిత్స చేయించి ఇంటి దగ్గర ఆర్సీపురం పోలీసులు దింపినట్లు సమాచారం.

Next Story
Share it