జేబులో ఉన్న చిరిగిన పేపర్.. మర్డర్ మిస్టరీని బయట పెట్టింది

Police crack murder case using torn medical prescription.థానేలోని భివాండిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య మిస్టరీని

By M.S.R  Published on  27 Jan 2022 1:46 PM IST
జేబులో ఉన్న చిరిగిన పేపర్.. మర్డర్ మిస్టరీని బయట పెట్టింది

థానేలోని భివాండిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య మిస్టరీని ఛేదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది అయితే అతడి ఆనవాళ్లను గుర్తించడానికి చాలా సమయమే పట్టింది. అయితే మృతుడి జేబులో ఉన్న చిరిగిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ ద్వారా పోలీసులు హత్య కేసును చేధించారు.

అర్మాన్ అలీ షాగా మృతుడిని గుర్తించారు. జేబులో చిరిగిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఉపయోగించి కేసును ఛేదించినట్లు నిజాంపుర పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పుడు ముగ్గురు వ్యక్తులైన సల్మాన్ షేక్ (27), తస్లీమ్ అన్సారీ (30), బిలాల్ అన్సారీ (26)లను అరెస్టు చేశారు.

ప్రధాన నిందితుడు తస్లీం అన్సారీ మృతుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. బాధితుడు అర్మాన్ షా వారి సంబంధాన్ని వ్యతిరేకించాడు. తస్లీమ్ అతని స్నేహితులు సల్మాన్, బిలాల్ సహాయంతో అర్మాన్ షాను కొట్టి చంపాడు. జనవరి 20న కంబ గ్రామంలోని వంతెన కింద గోనె సంచిలో పలు గాయాలతో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. షా జేబులో వైద్యుల ప్రిస్క్రిప్షన్ దొరకడంతో మృతదేహం గురించి పోలీసులకు కొంత క్లూ లభించింది. పోలీసులు ప్రిస్క్రిప్షన్ జారీ చేసిన వైద్యుడిని కనుగొనగలిగారు. ఆ తర్వాత కొంత సమాచారంతో మృతుడిని గుర్తించారు. విచారణ చేయగా హత్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story