ఆ కాఫీ ఫ్లాస్క్ లో ఉన్నది చూసి పోలీసులే షాక్ అయ్యారు
Over 3 kg gold concealed in coffee bottles.స్మగ్లింగ్ చేయడానికి ఎన్నెన్నో మార్గాలను వెతుకుతూ ఉన్నారు కేటుగాళ్లు. అయితే
By M.S.R Published on 20 Dec 2021 7:58 AM GMTస్మగ్లింగ్ చేయడానికి ఎన్నెన్నో మార్గాలను వెతుకుతూ ఉన్నారు కేటుగాళ్లు. అయితే పోలీసులు మాత్రం ఎంతో తెలివిగా వాటిని పట్టేస్తున్నారు. తాజాగా ఆదివారం నాడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ కీలక ఘటన చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారులు ఆదివారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అంతేకాకుండా కెన్యా మహిళల బృందం నుండి కాఫీ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 3.8 కిలోల బంగారాన్ని, కొన్ని ప్రైవేట్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి మహిళలు వచ్చారు. బంగారాన్ని స్వాధీనం చేసుకునే ముందు విమానాశ్రయంలోని 18 మంది కెన్యా మహిళలను తనిఖీ చేశారు.
కాఫీ పౌడర్ సీసాలు, ఇన్నర్ వేర్ లైనింగ్, పాదరక్షలు, మసాలా బాటిళ్లలో దాచి ఉంచిన బంగారాన్ని బార్లు, వైర్లు, పౌడర్ రూపంలో ఉండడాన్ని గుర్తించారు. ఇతర కెన్యా మహిళను అధికారులు వెళ్లనిచ్చి.. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర పెద్ద మొత్తంలో బంగారాన్ని తీసుకువెళుతున్నందున అరెస్టు చేశారు.
రాజస్థాన్ జైపూర్‌లోని విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు యూఏఈ నుంచి వచ్చిన ఓ యువతి నుంచి దాదాపు రూ.20కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. సదరు యువతి బ్యాగ్‌లో డ్రగ్స్‌ను దాచుకొని తీసుకువచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో యువతి అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్, పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బ్యాగులో రెండు కిలోల హెరాయిన్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో హెరాయిన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.