నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం, చెరువులో పడి తల్లీకూతురు మృతి

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 10:50 AM GMT
Nagarkurnool, Tragedy, mother, daughter, died ,

 నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం, చెరువులో పడి తల్లీకూతురు మృతి

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లీకూతుళ్లుగా తెలుస్తోంది. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామానికి చెందిన నారమ్మ, ఆమె కూతరు సైదమ్మ శనివారం బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. అయితే.. బట్టలు ఉతుకుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోయారు. ఈత రాకపోవడంతో బయటకు వచ్చేందుకు వీలు దొరకలేదు. నీటమునిగిపోయారు. అయితే.. అక్కడే ఉన్న కొందరు. అరుపులతో చెరువులో మునిగిపోతున్న మహిళలను గమనించారు. వెంటనే చెరువులోకి దూకి వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే వారు నీటిలో మునిగిపోయారు. చివరకు స్థానికులే ఇద్దరు మహిళల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చెరువులో అనూహ్యంగా పడి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక సైదమ్మ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Next Story