సుపారీ ఇచ్చి స్నేహితుడి మర్డర్.. అదే కిల్లర్ చేతిలో డబ్బులిచ్చిన వ్యక్తి హత్య

మహారాష్ట్రలోని ముంబైలో ఒక మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 3:30 AM GMT
Mumbai, double murder case, contract killing, fail,

సుపారీ ఇచ్చి స్నేహితుడి మర్డర్.. అదే కిల్లర్ చేతిలో డబ్బులిచ్చిన వ్యక్తి హత్య

మహారాష్ట్రలోని ముంబైలో ఒక మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చి చంపించాడు. కానీ.. అదే కిల్లర్‌ చేతిలో అతను కూడా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ముంబైలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీ ముంబైకి చెందిన ప్రాపర్టీ డీలర్లు అమీర్ ఖాంజదా, సుమిత్ జైన్‌లు ఇద్దరూ స్నేహితులు. ఇద్దరి మధ్య ల్యాండ్ డీల్ వివాదం తలెత్తింది. ల్యాండ్ డీల్ వివాదం నేపథ్యంలో ఖంజదాను చంపడానికి సుమిత్‌ జైన్ కాంట్రాక్ట్ కిల్లర్‌ని నియమించుకున్నాడు. ఖంజదాను అనుకున్నట్లుగానే కిల్లర్లతో చంపించాడు. కానీ.. దురదృష్టవశాత్తు జైన్ కూడా హంతకులచే చంపబడ్డాడు.

నెరుల్‌లో నివాసముంటున్న ఖాంజదా, జైన్‌లు ఆగస్టు 21న వ్యాపార సమావేశానికి కారులో వెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. వారి వారి కుటుంబ సభ్యులు మరుసటి రోజు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. తమ కారులోని జీపీఎస్‌ని ఉపయోగించి పోలీసులు వాహనాన్ని ఖోపోలీకి వెళ్లినట్లు ట్రాక్ చేశారు. కారుని కొనుగొన్నారు. అయితే.. అందులో రక్తపు మరకలు, బుల్లెట్ గుర్తులు, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఎనిమిది ప్రత్యేక బృందాలతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

ల్యాండ్‌ వివాదంలో భాగంగా.. జైన్‌ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ను నియమించుకున్నాడు. నకాడే అనే కిల్లర్‌కు రూ.50 లక్షలు ఆఫర్ చేశాడు. ఖంజాదాను చంపి.. ఆపై తనని కిడ్నాప్ చేసినట్లుగా చిత్రీకరించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే స్నేహితుడు ఖంజాదాను తీసుకుని కారులో వెళ్లాడు. అయితే.. ఖంజాదాను చంపిన తర్వాత జైన్‌ నుంచి పూర్తి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు హంతకులు. కిడ్నాప్‌లో భాగంగా జైన్‌ తన కాలుపై కాల్చుకున్నాడు. కానీ కాసేపటికే జైన్‌ తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు. దాంతో.. హంతకుల ముఠా అతడి డెడ్‌బాడీని పాడేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. పెన్-ఖోపోలి రోడ్డులో రోడ్డు పక్కన జైన్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు, ఆపై కర్నాలా బర్డ్ శాంక్చురీ సమీపంలో ఖంజదా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. చివరకు ఈ రెండు హత్యలకు పాల్పడ్డ ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. హంతకులు విఠల్ బాబన్ నకాడే (43) తనో పాటు ఈ హత్య కోసం మరో నలుగురిని తీసుకెళ్లాడు. జైసింగ్ అలియాస్ రాజా మధు ముదలియార్ (38), ఆనంద్ అలియాస్ ఆండ్రీ రాజన్ కుజ్ (39), వీరేంద్ర అలియాస్ గో-య భరత్ కదమ్ (24), అంకుష్ అలియాస్ అంక్య ప్రకాష్ సితాపురే. అలియాస్ సితాఫే (35)గా పోలీసులు తెలిపారు.

Next Story