మొయినాబాద్‌ యువతి మృతికేసులో వీడిన మిస్టరీ.. స్నేహం కోసం...

మొయినాబాద్‌లో యువతి మృతదేహం లభ్యం సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  13 Jan 2024 8:18 AM IST
moinabad, young girl, death case, rangareddy ,

మొయినాబాద్‌ యువతి మృతికేసులో వీడిన మిస్టరీ.. స్నేహం కోసం...

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో యువతి మృతదేహం లభ్యం సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మంటల్లో యువతి కాలిపోతుండగా స్థానికులు చూసి భయబ్రాంతులకు గురై పోలీసులకు చెప్పారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న కూడా యువతిని కాపాడలేకపోయారు. అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయి ప్రాణాలు కోల్పోయింది. నాలుగు రోజుల క్రితమే జరిగిన ఈ సంఘటనలో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు ఈ కేసులో మిస్టరీ వీడింది.

రాజేంద్రనగర్‌ డీసీపీ ఎస్‌.రష్మి పెరుమాళ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు గోకుల్‌నగర్‌కు చెందిన తహసీన్‌బేగం (22) సంవత్సరాలు. మెహిదీపట్నంలోని మదీనా డిగ్రీ కాలేజ్‌లో చదువుతోంది. తండ్రి చనిపోగా.. తల్లితో కలిసి ఉంటోంది. తహసీన్‌బేగం సున్నితమైన మనస్కురాలు. ఈమె మురాద్‌నగర్‌కు చెందిన యువతితో సన్నిహితంగా ఉండేది. చిన్న సమస్య వల్ల కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలు అయ్యాయి. పలుమార్లు స్నేహితురాలిని కలిసేందుకు తహసీన్‌బేగం ప్రయత్నం చేసింది కానీ.. ఫలితం లేకపోయింది. దాంతో.. సదురు యువతి కుంగుబాటుకు గురైంది. ఒకసారి చేతి నరాలు కోసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అప్పుడు ప్రమాదం తప్పింది.

ఆ తర్వాత కూడా మరోసారి స్నేహితురాలితో మాట్లాడాలి అనుకుంది. మళ్లీ విఫలం కావడంతో ఎడబాటుని జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలో జనవరి 6వ తేదీన ఐదు లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసింది. దాన్ని మురాద్‌నగర్‌లోని ఫ్రెండ్‌ ఇంట్లో దాచింది. ఆ తర్వాత ఈ నెల 8న ఉయం 11.30 గంటలకు ఆటోను మల్లేపల్లి నుంచి మొయినాబాద్‌ డ్రీమ్‌వ్యాలీ రిసార్ట్‌కు తీసుకెళ్లేందుకు మాట్లాడుకుంది. అందులోనే మ.12.10 గంటలకు మురాద్‌నగర్‌ రాయల్‌ కాలనీలోని స్నేహితుల గదికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత చేతిలో పెట్రోల్‌ క్యాన్‌తో ఆటో ఎక్కింది. మ.1.38 గంటలకు మొయినాబాద్‌ వెళ్లేందుకు ఎన్కేపల్లి వద్దకు ఆటో చేరింది. ఇక మధ్యామ్నం 1.43 గంటలకు డ్రీమ్‌వ్యాలీ ప్రధాన ద్వారం వద్ద నుంచి బాకారంలోని సత్యనారాయణరెడ్డి ఫామ్‌హౌస్ ప్రాంతానికి చేరుకుంది. ఆటో దిగి తహసీన్‌ డ్రైవర్‌కు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చింది. మ.1.53 గంటలకు మురాద్‌నగర్‌లోని స్నేహితురాలికి ‘టుడే ఈజ్‌ మై లాస్ట్‌డే’ అని సందేశం పంపింది. స్నేహితుడు రాహిల్‌తో ఫోన్‌ మాట్లాడి స్విచ్ఛాఫ్‌ చేసింది. బాకారం వద్ద నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొంది.

యువతి మంటలంటించుకుని చనిపోయినట్లు ఈనెల 8న మ.2.24కు మొయినాబాద్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముండుగా గుర్తించలేని స్థితిలో మృతేహం ఉండటంతో.. కాల్స్‌ డేటా.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మిస్సింగ్‌ కేసులన్నింటినీ ఆరా తీశారు. ఆ తర్వాత ఆటో ఎక్కిన విషయాన్ని గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలు దూరం పెట్టిందనే మనస్థాపంతో తహసీన్‌ చనిపోయిందని పోలీసులు తేల్చారు.

Next Story