ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో విద్యార్థిని హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక ఎంఎస్సీ విద్యార్థిని అని, ఆమెతో కలిసి చదువుతున్న విద్యార్థి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. సోమ్‌నాథ్ అనే విద్యార్థి వన్ సైడ్ లవ్ అని చెబుతూ.. అమ్మాయి వెంట తిరుగుతూ ఉండేవాడు. ఆమె తండ్రి కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితులు ముందుగా బాలికకు జ్యూస్‌లో మత్తు మాత్రలు వేసి తాగించి, ఆపై గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన డిసెంబరు 29న చోటు చేసుకోగా.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మూడో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

బాలికపై నిందితుడు మొదట తన ప్రేమను వెల్లడించాడని, బాలిక అందుకు నిరాకరించిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు కుట్ర పన్ని డిసెంబర్ 29న కలవాలని పిలిచి, ఆ తర్వాత అమ్మాయిని తన కారులో కూర్చోబెట్టుకున్నాడు. అమ్మాయికి మత్తు మందు తినిపించాడని, ఆమె స్పృహతప్పి పడిపోయిందని ఆరోపించారు. అనంతరం తన స్నేహితులతో కలిసి విద్యార్థిని గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం నిందితులు బాలిక చేతులు, కాళ్లను వైర్‌తో కట్టేశారు. హత్య చేసిన తర్వాత హంతకుడు బాధితురాలి మృతదేహంతో దాదాపు నాలుగు గంటలపాటు తన కారులో వీధుల్లో తిరిగాడు. రాత్రి సమయంలో మృతదేహాన్ని సీఓడీ వంతెన కింద పడేసి పరారయ్యారు.

M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story