వివాహేతర సంబంధం.. భర్త కూడా రావాలని భార్య కండీషన్.. చివరకు

మహిళ వివావేహతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి వద్దకే భర్తను రావాలని చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 6:55 AM GMT
khammam, woman, Extramarital affair,

 వివాహేతర సంబంధం.. భర్త కూడా రావాలని భార్య కండీషన్.. చివరకు

ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. ఆస్తుల కోసమో.. ఇతరత్రా చిన్నకారణాలకే గొడవపడి విడిపోతున్నారు. ఇక వివాహ సంబంధాన్ని అయితే ఇట్టే తెంచేసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లితో ఒక్కటైన ఇద్దరిలో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకోవడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఓ వివాహిత ఇలానే చేసింది. అంతటితో ఆగకుండా భర్తను కూడా తనతో ప్రియుడి వద్దకు వచ్చేయాలంటూ కండీషన్ పెట్టింది. దాంతో.. తీవ్ర మనస్థాపం చెందిన ఆ భర్త ప్రాణాలను తీసుకున్నాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వంశీ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గోకినేపల్లికి చెందిన ఓ యువతిని అతను పెళ్లాడాడు. కొన్నాళ్లు బాగానే ఉన్న వీరి సంసారం.. తర్వాత చిన్నచిన్న గొడవలు మొదలు అయ్యాయి. అయితే.. ఐదేళ్ల దాంపత్య జీవితంలో వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. చిన్నచిన్న గొడవలు ఉన్నా.. సాఫీగా సాగుపోతుంది వీరి జీవితం. కానీ.. భర్తకు తెలియకుండా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధమే వీరి కాపురంలో చిచ్చు పెట్టింది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త వంశీ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఆమె మాట వినలేదు. పైగా.. ప్రియుడితో వెళ్లిపోయి వేరే కాపురం పెట్టింది.

వంశీ తమకు ఒక కుమారుడు ఉన్నాడనీ.. తన వద్దకు వచ్చేయాలని చెప్పాడు. దానికి ఆమె ప్రియుడిని విడిచి వచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. తాను కావాలని అనుకుంటే భర్తనే తన వద్దకు వచ్చేయాలని.. ప్రియుడితో కలిసి ముగ్గురం ఉందామని కండీషన్ పెట్టింది. కట్టుకున్న భార్య అలాంటి మాటలు చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మరో వ్యక్తితో కలిసి ఉండటమే కాకుండా.. తనను అదే ఇంట్లో ఉండాలని చెప్పడంతో వేదన చెందాడు. తాను ఇక బతికి ఉండి లాభం లేదని అనుకున్నాడు. తాను ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మృతుడి తండ్రి శివయ్య తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Next Story