ఇన్‌స్టాలో పరిచయం.. యువతిని 20రోజులు రూమ్‌లో బంధించిన వ్యక్తి

సోషల్‌ మీడియా కాలం నడుస్తోంది. స్నేహితులు ఈజీగా పెరిగిపోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  9 Sept 2024 9:45 AM IST
ఇన్‌స్టాలో పరిచయం.. యువతిని 20రోజులు రూమ్‌లో బంధించిన వ్యక్తి

సోషల్‌ మీడియా కాలం నడుస్తోంది. స్నేహితులు ఈజీగా పెరిగిపోతున్నారు. చాటింగ్‌లు చేస్తూ.. మాట తీరు నచ్చితే చాలు.. ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి స్నేహాలు కొన్నిసార్లు ప్రేమ వరకు దారి తీస్తున్నాయి. కొన్నిసార్లు మోసపోయిన వారూ ఉన్నారు. అయితే.. తాజాగా ఓ 18 ఏళ్ల యువతికి ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. 19 ఏళ్ల యువకుడు.. బైంసాకు చెందిన యువతితో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే యువకుడిని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చింది.

నారాయణగూడకు వచ్చిన యువతిని ఆ యువకుడు హోటల్‌ రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రూమ్‌లో బంధించాడు. పెళ్లి చేసుకుంటానని యువకుడు నమ్మించి బాలికను హైదరాబాద్ కు రప్పించాడు. నారాయణగూడలోని ఓ హోటల్ రూమ్ లో గత 20 రోజులుగా నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో యువకుడు హోటల్ రూమ్‌కు తాళం వేసి అక్కడి నుండి పారిపోయాడు. అలా దాదాపు 20 రోజుల పాటు ఒకే రూమ్‌లో బంధించి ఉంచాడు. చివరకు యువతి తన తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపింది. లోకేషన్‌ను షేర్ చేసింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని హైదరాబాద్‌కు వచ్చి షీటీమ్స్‌తో చెప్పారు. రంగంలోకి దిగిన షీటీమ్స్ లొకేషన్ ఆధారంగా చేసుకుని హోటల్‌కు వెళ్లాయి. యువతిని కాపాడాయి. ఆ తర్వాత 19 ఏళ్ల నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. తనిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. బాధిత విద్యార్థిని ఇంజినీరింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. నిందితుడు తనను హైదరాబాద్‌కు రమ్మని బెదిరించాడని.. తనను 20 రోజుల పాటు హోటల్ గదిలో బంధించాడని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story