కర్ణాటక బీచ్‌లో తెలుగు మహిళ మృతి

తెలుగు మహిళ కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్ బీచ్‌లో నీటిలో ప్రాణాలు కోల్పోయింది.

By M.S.R  Published on  11 Jun 2024 11:45 AM GMT
hyderabad woman, dead,  karnataka, beach,

కర్ణాటక బీచ్ లో తెలుగు మహిళ మృతి

తెలుగు మహిళ కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్ బీచ్‌లో నీటిలో ప్రాణాలు కోల్పోయింది. నీటిలో మునిగిపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. అయితే మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. మృతురాలిని రత్న కుమారి (57)గా గుర్తించారు. తెలంగాణ లోని శేరిలింగపల్లికి చెందిన మహిళగా గుర్తించారు.

నలుగురు మహిళలు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో పెద్ద కెరటం రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే వారిని నీటిలో నుండి బయటకు తీశారు. అయితే అపస్మారక స్థితిలోకి రత్న కుమారి వెళ్ళిపోయింది. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.. అయితే అక్కడ ఆమె చనిపోయిందని ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు మహిళల బృందం జూన్ 6న విమానంలో మైసూరుకు చేరుకుంది. మైసూరులో పర్యటించిన తర్వాత జూన్ 7న ఇన్నోవా కారులో కొడగుకు వెళ్లారు. ఆ తర్వాత సందర్శన కోసం ఉల్లాల్ బీచ్‌కు చేరుకోగా.. అక్కడ ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

Next Story