భార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!
జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 3:20 PM ISTభార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!
దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటం సహజం. కానీ.. తరచూ గొడవలు జరిగితేనే ఇబ్బంది. పిల్లలు ఉంటే వారు కూడా అదే వాతావరణంలో పెరుగుతారు. కొందరు రోజూ గొడవపడుతుండటంతో జీవిత భాగస్వామిపై విసుగొచ్చి విడాకుల వరకు వెళ్తారు. ఇంకొన్ని సందర్భాల్లో ఆవేశంతో హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో నరేశ్ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే.. వీరి మధ్య గొడవ జరిగింది. దాంతో నరేశ్‌ను భార్య తీవ్రంగా తిట్టింది. భార్య మాటలతో నరేశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కట్టుకున్న భార్య లెక్క చేయకుండా తిడుతోందని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బాధతో కోరుట్ల అన్నమయ్య గుట్ట బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో శవం తేలి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి వివారాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత భార్యకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. దంపతుల మధ్య గొడవలు జరగడం సహజం. అంతమాత్రానికి ఆత్మహత్య చేసుకోవాలా అంటూ నరేశ్ భార్య బోరున విలపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్నారు. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.