భార్యతో కలిసి ప్రియురాలిని దారుణంగా చంపిన భర్త

యువతిని ప్రేమంచి.. ఆ తర్వాత భార్యతో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు ఓ వివాహితుడు.

By Srikanth Gundamalla  Published on  27 Nov 2023 8:15 AM IST
husband,  killed,  girlfriend, with wife,

భార్యతో కలిసి ప్రియురాలిని దారుణంగా చంపిన భర్త

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. భాగస్వామితో ఏ మాత్రం సంతోషంగా లేకపోయినా పక్కింటి చూపులు చూస్తున్నారు. ఇక కొందరు అయితే తమ జీవిత భాగస్వామిని మోసం చేసి తప్పు అడుగులు వేస్తూ వివాహేతర సంబంధాలు పెట్టకుంటున్నారు. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ విషయం బట్టబయలు అయ్యాక దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. హత్యలు చేసే స్థాయి వరకూ చేరుకుంటున్నారు. తాజాగా ఒడిశాలోని నవరంగాపూర్‌ జిల్లాలో జరిగింది.

నవరంగాపూర్‌ జిల్లా బాఘబెడ గ్రామానికి చెందిన లుథురామ్‌ కుమార్తె తిలాబబతి గండ్ (23) జీవితం సాఫీగా సాగుతోంది. ఆమె జీవితంలో అనుకోకుండా ఓ వివాహితుడు వచ్చాడు. మాయమాటలు చెప్పాడు.. ఆ తర్వాత ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటాన అని కూడా హామీ ఇచ్చారు ప్రియుడు. అయితే.. యువతిని ప్రేమించిన వ్యక్తి బారసుండి గ్రామానికి చెందిన చంద్ర రౌత్. అతనికి అప్పటికే పెళ్లి అయ్యి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అయినా.. అతను యువతితో చనువు పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

దాంతో.. గత శనివారం యువతి తనని పెళ్లి చేసుకోవాలంటూ బారసుండి గ్రామంలోని చంద్రరౌత్‌ ఇంటికి వెళ్లింది. తనని పెళ్లి చేసుకోవాలని లేదంటే అక్కడి నుంచి వెళ్లనంటూ బీష్మించుకు కూర్చొంది. చంద్రరౌత్‌ భార్య సియాబతి ఆమెను తన భర్త పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో.. ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. తనని చంద్ర రౌత్‌ మోసం చేశాడని తిలాబతి కోర్టును ఆశ్రయిస్తానని బెదిరించింది. దాంతో.. భయపడిపోయిన చంద్ర రౌత్‌, అతని భార్య ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేశారు. అనుకున్నట్లుగానే ఇంట్లోకి పిలిచి ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మరుమడిహి అడవిలోకి తీసుకెళ్లి 31 ముక్కలుగా నరికి పాతిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. తిలాబతి గండ్‌ కనిపించడం లేదండూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దాంతో మిస్సింగ్‌ కేసుగా పోలీసులు నమోదు చేశారు.

కాగా.. చంద్ర రౌత్‌ దంపతులు యువతిని నరికి ముక్కలుగా చేసి అడవిలో పాతిపెడుతుండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చూశాడు. ఆవిషయం గ్రామస్తులందరికీ తెలియజేశాడు. వారంత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహం భాగాలను వెలికి తీశారు. ఆ తర్వాత అప్పటికే తిలాబతి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపరీక్ష అనంతరం డెడ్‌బాడీ తిలాబతితే అని తేలింది. పోలీసులు సంఘటనాస్థలిలో కత్తి స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన భార్యభర్తలు పరారీలో ఉన్నారనీ.. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story