దారుణం.. 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థినుల పాలిట శాపం అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 4:47 PM ISTరుణం.. ఆరేళ్లలో 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థినుల పాలిట శాపం అయ్యాడు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా వంద మందికిపైగా విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం ఈ వార్త జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదురు ప్రిన్సిపాల్‌పై దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు సైతం అసహ్యించుకుంటున్నారు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
హర్యానాలోని జింద్ జిల్లాలో స్థానికంగా ఉన్న పాఠశాలలో ప్రిన్సిపాల్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఇటీవల ప్రిన్సిపల్ తమపై లైంగికం వేధింపులకు పాల్పడుతున్నారంటూ 15 మంది బాలికలు ఫిర్యాదు చేయడంతో అతని పూర్తి బాగోతం వెలుగులోకి వచ్చింది. 15 మంది బాలికలు ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ, ప్రధాని మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా, జాతీయ మహిళా కమిషన్, హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే.. స్కూల్ ప్రిన్సిపాల్‌పై 15 మంది విద్యార్థునులు ఒకేసారి ఫిర్యాదు చేయడంతో కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ కోసం సబ్ డిజవినల్ మెజిస్ట్రేట్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఆ సభ్యులు విచారణ కోసం విద్యార్థినులు చదువుతోన్న పాఠశాలకు వెళ్లారు. అక్కడ చదువుతోన్న మొత్తం 390 మంది బాలికలను విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 142 మంది బాలికలు తమపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పారని కమిటీ నివేదికలో తెలిపింది. మిగతావారిలో కొందరు విద్యార్థినులు తమ ముందే లైంగిక వేధింపులకు పాల్పడేవారని కమిటీ విచారణలో చెప్పారు. అయితే.. ఈకేసులో 15 మంది బాలికల ఫిర్యాదుతో హర్యానా మహిళా కమిషన్ మొదట సెప్టెంబర్ 13వ తేదీన విచారణ చేపట్టింది. ఆ తర్వాత నిందితుడైన ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు.
కాగా.. 142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపాల్ గత ఆరేళ్లలో లైంగికంగా వేధించనిట్లు నివేదిక ద్వారా తెలిసింది. కాగా.. నిందితుడిని నవంబర్ 4వ తేదీన అరెస్ట్ చేసినట్లు మహిళా కమిషన్ రాసిన లేఖ ఆధారంగా వెల్లడి అయ్యింది. నవంబర్ 7న కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకు తరలించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేశారనే దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి.