జైపూర్‌-ముంబై రైలులో కాల్పులు, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు కలకలం రేపాయి.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 5:27 AM GMT
Gun Fire,  Jaipur-Mumbai Train, 4 Dead,

జైపూర్‌-ముంబై రైలులో కాల్పులు, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో.. ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార.

జైపూర్-ముంబై రైలులో కాల్పుల ఘటనపై పశ్చిమ రైల్వే ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని పేర్కొంది. అతను జరిపిన కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, మరో ముగ్గురు ప్రయాణికులు మరణించారని తెలిపింది. కాల్పుల అనంతరం దహిసర్‌ స్టూషన్ దగ్గర నిందితుడు కదులుతున్న రైలు నుంచే కిందకు దూకాడని తెలిపింది. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే అతని కోసం గాలించారు. కాసేపటికే పోలీసులు కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌తో పాటు అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. ఆ తర్వాత ఈ సంఘటనను చూసిన ప్రయాణికుల వాంగ్మూలాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్ మానసికంగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

నిందితుడు జరిపిన కాల్పుల్లో అదృవశాత్తు ఎక్కువమంది చనిపోలేదు..ఎక్కువమందికి గాయాలు కూడా కాలేదని ప్రయాణికులు అంటున్నారు. అసలు ఎందుకు కాల్పులు జరిపాడు.? మానసిక పరిస్థితి బాగలేకపోవడమేనా? లేదంటే ఘర్షణ ఏమైనా జరిగిందా..? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story