ప్రొఫెసర్‌తో యువతి ప్రేమ.. వద్దన్నందుకు ఎంత పని చేసింది..!

హైదరాబాద్‌లో ఓ యువతి ప్రొఫెసర్‌ను ప్రేమించింది. అంతేకాదు.. ప్రపోజ్‌ కూడా చేసింది.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 6:57 AM IST
group-1  student, love, professor, photo morphing,

ప్రొఫెసర్‌తో యువతి ప్రేమ.. వద్దన్నందుకు ఎంత పని చేసింది..!

హైదరాబాద్‌లో ఓ యువతి ప్రొఫెసర్‌ను ప్రేమించింది. అంతేకాదు.. ప్రపోజ్‌ కూడా చేసింది. అయితే.. ఆయనకు అప్పటికే పెళ్లి అయిపోయిందనీ.. పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. సున్నితంగానే సదురు యువతి ప్రేమను తిరస్కరించాడు. సివిల్స్‌ లక్ష్యంతో ఉన్నావనీ.. బాగా చదువుకోవాలని చెప్పాడు. అయితే.. ఆ యువతి ప్రేమను తిరస్కరించడం తీసుకోలేకపోయింది. ప్రొఫెసర్‌పై కక్ష పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈనేపథ్యంలో ఎవరూ ఊహించని చర్యకు పాల్పడింది.

అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన ఓ యువతి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతోంది. కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేసే ఒ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇదే విషయాన్ని తీసుకెళ్లి ప్రొఫెసర్‌తో చెప్పింది యువతి. దాంతో.. ఆయన తనకు ఇంతకుముందే పెళ్లి అయిపోయిందనీ.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తిరస్కరించాడు.

అంతే గురువుపై అప్పటి నుంచి కక్ష పెంచుకుంది. ఆయన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి కుమార్తె, భార్య ఫొటోలను సేకరించింది. అశోక్‌నగర్‌లో ఇద్దరు భిక్షగాళ్ల పేరుతో రెండు సిమ్‌ కార్డులు కొన్నది. సోషల్ మీడియాలోఫేక్‌ అకౌంట్లు క్రియేట్ చేసింది. గురువు కుమార్తె, భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. యూట్యూబ్‌ వీడియోల కామెంట్ల విభాగంలో పోస్టు చేసింది. ఇక ఈ ఫొటోలను ఫ్యాకల్టీ మెంబర్‌ స్టూడెంట్స్, ఆయన కుమార్తె స్నేహితుల అసభ్యకర ఫొటోలను గుర్తించి వారిని అలర్ట్ చేశారు. ఆందోళనకు గురైన బాధితుడు ఫిబ్రవరి 2న సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా.. టెక్నాలజీ సాయంతో సదురు యువతి ఈ పని చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

Next Story