రివాల్వర్‌తో కాల్చుకుని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
తమిళనాడులోని కోయంబత్తూరు డీఐజీ విజయ్‌కుమార్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 11:18 AM ISTరివాల్వర్‌తో కాల్చుకుని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
తమిళనాడు పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అంతేకాదు సీబీసీఐడీలో కూడా ఎస్పీగా విజయ్‌కుమార్ పని చేశారు. గత జనవరిలోనే విజయ్ కుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.
విజయ్‌కుమార్ కుటంబ సమస్యలతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సరిగా నిద్ర కూడా పోవడం లేదని తోటి అధికారులు చెబుతున్నారు. డీఐజీ విజయ్‌కుమార్ డిప్రెషన్‌తోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జూలై 6న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిసనర్ కుమారుడి పుట్టిన రోజు వేడులకు హాజరయ్యారు విజయ్‌కుమార్. వేడుకలు పూర్తయ్యాక తన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఈ వార్త తమిళనాడు పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది.
కాగా.. విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఐజీ ఆత్మహత్య ఘటనపై పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌కుమార్ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక డీఐజీ విజయ్‌కుమార్ మృతి ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు సీఎం స్టాలిన్.