మటన్ సూప్ లో అన్నం.. వెయిటర్ ను చంపేశారు
Customers kill waiter at Pune hotel.19 ఏళ్ల వెయిటర్‌ని ఇద్దరు కస్టమర్లు హత్య చేశారు.
By M.S.R
మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల వెయిటర్‌ని ఇద్దరు కస్టమర్లు హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి పూణెలోని పింపుల్ సౌదాగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నాణ్యత లేని సర్వీస్‌పై ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఇద్దరు కస్టమర్లు హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. కస్టమర్ల దాడిలో మరో ఇద్దరు హోటల్ సిబ్బంది కూడా గాయపడ్డారు. నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు పూణె పోలీసులు బుధవారం తెలిపారు.
#WATCH | Greater Noida, UP: The staff of a private restaurant in Ansal mall was thrashed for a delay in their order. All three accused, residents of Dadri were arrested & were sent to jail: ADCP Vishal Pandey (10.11) pic.twitter.com/Uxn6igGQUQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 11, 2022
మంగేష్ పోస్టే అనే వెయిటర్ పై దాడి చేసినప్పుడు ఇద్దరు కస్టమర్లు మద్యం మత్తులో ఉన్నారని పిటిఐలో ఒక నివేదిక తెలిపింది. నిందితులు ఓ మటన్ సూప్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ సూప్‌లో అన్నం ఉండడంతో నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోటల్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి సమయంలో బాధితుడు పోస్టే తలపై కొట్టినట్లు ASI దిలీప్ పవార్ తెలిపారు. నిందితుల్లో ఒకరిని విజయ్ వాఘైరేగా గుర్తించారు. రెండో నిందితుడి పేరు ఇంకా తెలియరాలేదు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 కింద ఇద్దరు నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు.